తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బతుకమ్మ’

తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బతుకమ్మ’

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను దేశవిదేశాల్లో కూడా గొప్పగా చేసుకుంటున్నామన్నారు. మన సంస్కృతిని చాటి చెప్పేవి పండుగలు మాత్రమే అని చెప్పారు. ‘అనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం సాంస్కృతిక కళారూపాలు ఉద్యమ రూపాలైతే.. ఇవాళ స్వరాష్ట్రంలో సగర్వంగా మన పండుగను మనం చేసుకుంటున్నాం’ అని అన్నారు.

టీకేఆర్ కాలేజీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డితో  కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.