బీఆర్ఎస్ పార్టీని బ్రాహ్మణులు ఆశీర్వదించాలి : ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీని బ్రాహ్మణులు ఆశీర్వదించాలి : ఎమ్మెల్సీ కవిత

తమ కుటుంబం మొత్తం బ్రాహ్మణుల మాటలను నమ్ముతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ బ్రాహ్మణులకు బీఆర్ఎస్ టికెట్లు ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని బ్రాహ్మణులు ఆశీర్వదించాలని కోరారు. అర్చక స్వాములకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తోందన్నారు. దూప, దీప నైవేద్యాలకు నిధులు వెచ్చిస్తోందన్నారు. 2 వేల 240 కోట్ల నిధులతో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 

బోనాల నిర్వహణ కోసం ప్రతి ఏటా డబ్బులు ఇస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే పేద బ్రాహ్మణ విద్యార్థులకు 20 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోందన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బ్రాహ్మణ గర్జన సభలో ఎమ్మెల్సీ కవిత ఈ కామెంట్స్ చేశారు. ఈ సభకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.