
- లేకుంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తం
హైదరాబాద్, వెలుగు: మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మంగళవారం ఆమె తన నివాసంలో జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ మహిళలను చిన్నచూపు చూస్తున్నారని కవిత విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500 చొప్పున చెల్లిస్తమన్న హామీని కాంగ్రెస్ అమలు చేయకపోవడం దారుణమన్నారు.