మహిళల రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక అవసరం: ఎమ్మెల్సీ కవిత

మహిళల రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక అవసరం: ఎమ్మెల్సీ కవిత

మహిళల రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక అవసరం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మోడీ సర్కారు తలుచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టి సారించాలని..ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాస్తామన్నారు. చిన్నగా మొదలైన ఈ ఉద్యమం..దేశ వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు తాము పోరాడతామన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవితకు సీపీఐ నారాయణ, ఎంపీ కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. 

అందరి కోసం..

మహిళల రిజర్వేషన్ బిల్లు అంశం తెలంగాణ కోసం కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశం కోసమని..దేశంలోని అందరి మహిళల కోసమని చెప్పారు. మహిళలకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో దూసుకెళ్తారన్నారు. తెలంగాణలో ఏ ఉద్యమం చేపట్టినా..దాని లక్ష్యం నెరవేరిందని....ఇప్పుడు కూడా తాము ఢిల్లీలో దీక్ష చేపట్టామని....ఈ దీక్ష కూడా లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు. అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. తమ దీక్షకు మద్దతు తెలిపిన వారందరికి కవిత ధన్యవాదాలు తెలిపారు.