
రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఆ పార్టీ నేతలు హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వారికి పోలీసులు దగ్గరుండి స్వాగతాలు పలికారు. చుట్టూ నిలబడి కాపలా కాశారు. నాలుగు దిక్కులా గంటల కొద్దీ కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయినా.. జనం తిప్పలు పడ్డా.. నిరసన చేస్తున్న నేతలను పోలీసులు కనీసం పక్కకు కూడా పంపలేదు.