రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్రు.. ఈడీకి కవిత లేఖ

రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్రు.. ఈడీకి కవిత లేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు  లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని కవిత లేఖలో పేర్కోన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందని , దురుద్దేశ్యంతో వ్యవహరిస్తుందని  కవిత ఆరోపించారు. అందుకే తన పాత ఫోన్లన్నీ ఇచ్చేస్తున్నానని పేర్కొంది. నవంబర్​ లోనే తాను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ప్రచారం చేసిందని,  ఏ ఉద్దేశ్యంతో ఇలా చేశారని కవిత ఈడీని ప్రశ్నించారు. మహిళల ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అంటే స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందన్నారు.  ఫోన్ల విషయంలో కనిసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను విచారణకు సహకరిస్తున్నానని కవిత తెలిపారు.  మార్చి21న  రెండోరోజు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు తన ఫోన్లను మీడియాకు చూపించారు.