
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బీఆర్ఎస్ పార్టీలో కలకలం.. కేసీఆర్ కుటుంబంలోని లుకలుకలు బయటపడ్డాయి. తండ్రి కేసీఆర్ను ప్రశ్నిస్తూ.. కుమార్తె కవిత లేఖ రాయడం ఆసక్తిగా మారింది. అమెరికా పర్యటనలో ఉన్న కవిత.. అక్కడి నుంచే ఓ లేఖ రాశారు. మై డియర్ డాడీ అంటూ లేఖను మొదలు పెట్టిన కవిత.. తండ్రి కేసీఆర్కు పలు ప్రశ్నలను సంధించారు. మొత్తం ఆరు పేజీలతో కూడిన లేఖ రాసిన కవిత.. అందులో పాజిటివ్ ఫీడ్ బ్యాక్.. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ రెండు అంశాలను ప్రస్తావించారు.
కవిత లేఖలోని పాజిటివ్ అంశాలు:
- బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మీరు ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడటం అందరికి నచ్చింది
- మీ ప్రసంగంలో కాంగ్రెస్ ఫెయిల్, ఫెయిల్, ఫెయిల్ అంటూ మీరు చెప్పిన తీరు బాగుందని అందరూ అనుకుంటున్నారు
- పహల్గాం మృతులకు నివాళి మౌనం పాటించడం పాజిటివ్ అంశం
- సీఎం రేవంత్ రెడ్డి పేరు తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది.. సీఎం మిమ్మల్ని తిడుతున్నా మీరు హుందాగా వ్యవహరించారు
- ప్రసంగంలో మీరు పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా బాగుంది
కవిత లేఖలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ :
- ఉర్దూలో మాట్లాడకపోవటం
- వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవటం
- బీసీలకు 42 శాతం అంశం విస్మరించటం.
- ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవటం
- ఇంత పెద్ద మీటింగ్కు మళ్లీ పాత ఇంచార్జీలకు ఇవ్వటంతో.. వాళ్లు పాత పద్దతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్ బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది.
- మళ్లీ పాత ఇంచార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్ బీ ఫాంలు పార్టీ ఇస్తుంది అని ఇంచార్జీలు చెప్పుకుంటున్నట్లు కొన్ని చోట్ల నుంచి తెలిసింది.
- లోకల్ బాడీస్ లో సర్పంచ్ లుగా పోటీ చేయాలనుకునే వాళ్లు ఇంచార్జీలుగా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్లు..
- 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు వరంగల్ సభ వేదికపై ఎందుకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు.
- బీజేపీ పార్టీపై రెండే రెండు నిమిషాలు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోంది.
- బీజేపీ వల్ల నేను బాధపడ్డాను. బీజేపీని ఇంకా టార్గెట్ చేసి ఉంటే బాగుండేది.