వెల్ఫేర్ కమిటీ సమావేశం ఆపండి .. మంత్రి పొన్నంకు ఆర్టీసీ యూనియన్ నేత అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి

వెల్ఫేర్ కమిటీ సమావేశం ఆపండి .. మంత్రి పొన్నంకు ఆర్టీసీ యూనియన్ నేత అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఆపివేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎమ్మెల్సీ కోదండరాం, టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి కోరారు. శనివారం మంత్రి పొన్నంను మినిస్టర్ క్వార్టర్స్ లో కోదండరాం, అశ్వత్థామ రెడ్డి కలిశారు. ఈ నెల 27 న నిర్వహించనున్న వెల్ఫేర్ కమిటీ సమావేశాన్ని రద్దు చేసి ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం మధ్య సాగిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. 

ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో సమ్మెకు వెళ్లకుండా ఉన్న ఆర్టీసీ కార్మికులు, యూనియన్లకు ఈ వెల్ఫేర్ కమిటీ మీటింగ్ ను నిర్వహించడం..ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తోందని ఈ సందర్భంగా వారు మంత్రికి వివరించారు.