ఫీజు నియంత్రణ చట్టం తేవాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ఫీజు నియంత్రణ చట్టం తేవాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
  • ఎస్ఎఫ్ఐ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ముషీరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ప్రైవేట్​విద్యా సంస్థల ఫీజు దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టానికి రూపకల్పన చేయాలని కోరారు. ‘ఫీజు నియంత్రణ చట్టం.. ఆవశ్యకత’ అనే అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది.

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని చాలాచోట్ల అనుమతులు లేకుండా స్కూళ్లు, కాలేజీలు నడుపుతున్నారని, తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీతో అసమానతలు పెరుగుతాయన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు, అశోక్ రెడ్డి, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మధుసూదన్, పావని, నాగరాజు, పుట్ట లక్ష్మణ్, మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు.