రూపాయి బాకీ ఉన్నా ముక్కు నేలకు రాస్తా

రూపాయి బాకీ ఉన్నా ముక్కు నేలకు రాస్తా

వీణవంక, వెలుగు : హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్పంచులు, కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి బాకీ ఉన్నాముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండలంలోని బొంతుపల్లి, ఎల్భాక, గంగారం  గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏ చౌరాస్తాకు చర్చకు వస్తారో రావాలని, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా సరేనన్నారు. రాష్ట్రంలో సర్పంచులకు, ఎంపీటీసీలకు సర్కారు బిల్లులు చెల్లించడం లేదని చెప్పడానికి సిగ్గు, శరం, ఇజ్జత్ లేదా అని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లోని 106 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పెండింగ్ ఉన్నా  ముక్కు నేలకు రాస్తానన్నారు. కేంద్రం ఈజీఎస్ కింద రూ.1400 కోట్లను తెలంగాణకు ఇవ్వకుండా సర్పంచ్ లను, ఎంపీటీసీలను ఇబ్బందులు పెడుతోందన్నారు. ఈ విషయంలో పది రోజుల్లో స్పందించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.  ఆ డబ్బులు ఇప్పించకపోతే స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని నియోజకవర్గం లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుక, తిరుపతిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్​రెడ్డి పాల్గొన్నారు.