బీజేపీని అడ్డుకునే శక్తి కేసీఆర్ కే ఉంది

బీజేపీని అడ్డుకునే శక్తి కేసీఆర్ కే ఉంది

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కుట్రలు చేసినట్లే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కుట్రలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోందన్నారు. ఆధారాలు అవసరం వచ్చినప్పుడు బయటపెడుతామన్నారు. ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని, ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో చిలిపి వేషాలు వేస్తే బీజేపీని అడ్డుకునే శక్తి సీఎం కేసీఆర్ కు ఉందని చెప్పారు. ఇతర దేశాలకు, విదేశాల్లో పెట్టుబడిదారులకు కేంద్రం తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంపదను పంచడం మాత్రమే కాదు- సంపదను పెంచడం కూడా సీఎం కేసీఆర్ కు తెలుసన్నారు. 

సైనికులు దేశం మొత్తం సొంతమని, కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమరవీరుల సైనిక కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందించామన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.