
సికింద్రాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలబడాలని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకీ బీజేపీ నగరాధ్యక్షుడు రాంచందర్రావు సూచించారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు దీక్షకు రాంచందర్రావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. కార్మికుల పక్షాన నిలబడింది వెలుగు పేపర్ ఒకటే అని ఆయన అన్నారు. ధైర్య సాహసాలతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఆయన అభినందించారు.