అసెంబ్లీ ఆమోదం లేకుండానే 1.6 లక్షల కోట్ల ఖర్చు..గత ప్రభుత్వంపై తీన్నార్ మల్లన్న ఆరోపణలు

అసెంబ్లీ ఆమోదం లేకుండానే 1.6 లక్షల కోట్ల ఖర్చు..గత ప్రభుత్వంపై తీన్నార్ మల్లన్న ఆరోపణలు
  • మండలి చైర్మన్‌కు ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం రాష్ర్ట ఆవిర్భావం నుంచి  2024 వరకు అసెంబ్లీ ఆమోదం లేకుండానే  రూ. 1.6 లక్షల కోట్ల ఖర్చు చేసిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఈ  అంశంపై శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగ్​ నివేదికలో పేర్కొన్న ప్రకారం.. 2014 నుంచి 2018 వరకు రూ. 84,650.99 కోట్లు, 2018 –19లో రూ. 29,133. 69 కోట్లు ఖర్చు చేశారన్నారు.

 2019-–20లో రికార్డు స్థాయిలో రూ.47,896.44 కోట్లు అధికంగా ఖర్చు చేసి ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా దెబ్బతీశారని తెలిపారు.  శాసనసభకు తెలియజేయకుండా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది శాసనసభ అధికారాలను అవమానించే చర్య అని మల్లన్న పేర్కొన్నారు.