
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హసన్ పర్తి,వెలుగు : కేయూ సమస్యలపై విద్యార్థుల బృందాన్ని సీఎం దగ్గరికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హమీ ఇచ్చారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం మెంబర్ జి. వీరన్న నాయక్ ఆధ్వర్యంలో కేయూ లైబ్రరీ వద్ద విజయోత్సవ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు విద్యార్థి సంఘాలు ఘన స్వాగతం పలికి సన్మానించాయి. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఈ విజయం పట్టభద్రుల విజయమని
తన విజయంలో కాకతీయ యూనివర్సిటీ కీలకపాత్ర పోషించిందన్నారు, కేయూ టీచింగ్,నాన్ టీచింగ్ ఖాళీల భర్తీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ గజ్జల మల్లేశ్, కేయూ జేఏసీ లీడర్డాక్టర్ మంద వీరస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలవాల కార్తీక్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ డాక్టర్ తీగల ప్రేమ్ కుమార్, బండి శ్రీను, సురాసి కృష్ణ, మహమ్మద్ మహబూబ్ పాషా, అభిరామ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరెగంటి నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు.