హైదరాబాద్, వెలుగు: విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ విజయ శాంతి కోరారు. శనివారం ఆమె ఫేస్బుక్ లో ఓ పోస్టు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కోర్టుకు వెళ్లిన యాజమాన్యాలు, ప్రభుత్వం ద్వారా వాటిని వసూలు చేయించుకునే విషయంలో చూపుతున్న శ్రద్ధ, కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో, మౌలిక వసతులు కల్పించడంలో చూపించాలని సూచించారు.
ఈ అంశంపై గతంలో శాసన మండలిలో తాను ప్రస్తావించానని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం చెల్లించే ఫీజుకు తగిన న్యాయం చేసేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, కాలేజీల్లో కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
