
లేడీ మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సెట్ చేసుకున్నారు ఎంఎం శ్రీలేఖ. ఆమె ఇండస్ట్రీకొచ్చి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్‌ను మార్చి 17 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పోస్టర్‌ను రాజమౌళి లాంచ్ చేస్తూ ‘‘ఐదు భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ’ అన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సీరియల్ ‘శాంతినివాసం’కి తాను మ్యూజిక్ అందించానని, ఇప్పుడు తన టూర్ పోస్టర్‌ను ఆయన రిలీజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు శ్రీలేఖ. మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలై లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 25 దేశాలలో 25 మంది సింగర్స్‌తో ఈ మ్యూజిక్ టూర్ జరుగుతుందని శ్రీలేఖ తెలిపారు.