బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెళ్తున్న జంటపై అల్లరి మూక దాడి.. ఒడిశాలో బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహా వేధింపుల ఘటన

బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెళ్తున్న జంటపై అల్లరి మూక దాడి.. ఒడిశాలో బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహా వేధింపుల ఘటన

ఢెంకనల్: బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లపై జరిగిన వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం కలిగించిన కొద్దిరోజుల్లోనే ఒడిశాలోనూ అలాంటి అమానవీయ ఘటనే వెలుగుచూసింది. ఢెంకనల్ జిల్లాలో ఓ యువ జంటపై కొందరు వ్యక్తులు దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కపిలాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెళ్తున్న జంటను ఓ గుర్తుతెలియని గుంపు అడ్డగించింది. అనంతరం వారిని చుట్టుముట్టి యువకుడిపై దాడికి దిగడమే కాకుండా.. యువతి పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. 

తమను విడిచిపెట్టాలని ఆ యువతి వేడుకున్నా నిందితులు వినకుండా దాడి, వేధింపులు కొనసాగించారు. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఆ జంటను అల్లరి మూక ఎందుకు అడ్డుకుంది..? ముందే ఏదైనా గొడవ జరిగిందా?.. తదితర విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై గోండియా బ్లాక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ -ఇన్-చార్జ్ ప్రతాప్ దలై స్పందించారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గొడవకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.