పాకిస్తాన్ లో ప్రార్థనా మందిరాల విధ్వంసం: తప్పుడు ప్రచారం అంటున్న పోలీసులు

పాకిస్తాన్ లో ప్రార్థనా మందిరాల విధ్వంసం: తప్పుడు ప్రచారం అంటున్న పోలీసులు

పాకిస్తాన్లో చర్చిలు, క్రైస్తవుల ఇండ్లపై ఆగస్టులో మూక దాడులు జరిగిన విషయం తెలిసిందే.. ఇస్లాం మతం పవిత్ర గ్రంథం పేజీలను మరొకరి ఇంటివెలుపల విసిరివేయడంతో వివాదం చెలరేగి మూక దాడులకు దారి తీసింది. ఈ కేసులో నిందితులుగా రాజా అమీర్, అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు పాక్ చట్టాల ప్రకారం.. వారికి ఉరిశిక్ష పడుతుంది. అయితే వ్యక్తిగత వివాదం కారణంగానే వారిని దైవ దూష కేసులో ఇరికించారని సోమవారం పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

వ్యక్తిగత వివాదం ముదిరి... పంజాబ్ ప్రావిన్స్లోని జరన్ వాలా నగరంలో ఆగస్టు 16న జరిగిన మూక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో కనీసం 17 చర్చిలు, దాదాపు 100 ఇండ్లు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం జరగలేదు. కానీ దేశంలో క్రైస్తవులపై జరిగిన అత్యంత విధ్వంసకర దాడుల్లో ఇది ఒకటి. అప్పటి నుంచి అధికారులు చాలా చర్చిలను మరమ్మత్తు చేశారు. దాదాపు 100 కుటుంబాలకు వేల డాలర్లు పరిహారం అందజేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న దాదాపు 200 మంది ముస్లింలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దాడులకు సూత్రధారి పర్వేజ్ కోడు అని..అమీర్‌కు తన భార్యతో సంబంధం ఉందని భావించి, అమీర్ పవిత్ర పుస్తకాన్ని అపవిత్రం చేశాడని ముద్ర వేయడానికి కోడు తన ఇంటి వెలుపల పేజీలను విసిరితే ముస్లింలు అమీర్‌ను లక్ష్యంగా చేసుకుంటారని తెలుసు అని ముగ్గురు పోలీసు అధికారులు తెలిపారు.

తాజాగా అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ప్రధాన సూత్రధారి పర్వేజ్ కోడ్ కావాలనే రాజా అమీర్ ఇంటి బయట కుట్ర పన్ని ఖురాన్ పేజీలను విసిరినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ‘‘ముగ్గురు వ్యక్తులు హింసకు కారణమయ్యారని.. అమీర్ , అతని సోదరుడిని దైవదూషణ కేసులో తప్పుగా ఇరికించారని వారు అభియోగాలు ఎదుర్కొంటున్నారని’’ పోలీసులు చెప్పారు.