మణిపూర్ లో హై అలర్ట్..ఇంటర్నెట్ సేవలు బంద్..

మణిపూర్ లో  హై అలర్ట్..ఇంటర్నెట్ సేవలు బంద్..

మణిపూర్ లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. సెక్షన్ 144 సెక్షన్ ను విధించడం తో పాటు  ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసింది.  ఏప్రిల్  28న చురాచాంద్ పుర్ లో  సీఎం బీరెన్ సింగ్  పర్యటించాల్సి ఉండగా ఆయన సభకు  నిప్పు పెట్టడం కలకలం సృష్టిస్తోంది. అనూహ్యంగా  ఆయన పాల్గొనే సభను, సభావేదికకు  ఏప్రిల్ 27న సాయంత్రం నిరసన కారులు నిప్పు పెట్టారు. దీంతో అప్రమత్తమైని ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చురచంద్ పూర్ జిల్లాలో  144 సెక్షన్ తో పాటు   ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసింది.

అసలేం జరిగిందంటే?

మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం చిత్తడి నేలలతో పాటు రిజర్వ్, రక్షిత ప్రాంతాలను సర్వే  చేయడం ప్రారంభించింది.  దీనిని అక్కడి ఆదివాసీ గిరిజనులు వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కుతోంది. ప్రభుత్వం ప్రార్థనా స్థలాలను కూల్చేస్తోందని గిరిజన నాయకులు ఆరోపించారు. సీఎం తీరుపై ఆగ్రహంగా ఉన్నా గిరిజనలు  సమయం కోసం వేచి చూశారు. ఈ క్రమంలోనే సీఎం బీరెన్ సింగ్ చురాచాంద్ పూర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన జిమ్ క్రీడా వసతిని ప్రారంభించాల్సి ఉంది.  ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  సీఎంపై ఆగ్రహంగా ఉన్న గిరిజనలు ఇదే అదునుగా కొత్త గ్రౌండ్ లోని కుర్చీలను, ఇతర వస్తువులను ద్వంసం చేశారు. దీంతో సీఎం సభా వేదిక కూడా దగ్ధమైంది. 

https://www.youtube.com/@V6NewsTelugu/videos

https://twitter.com/ANI/status/1651789364916285442