రాష్ట్రంలో 97.7 శాతం గ్రామాల్లో మొబైల్​ కనెక్టివిటీ

రాష్ట్రంలో 97.7 శాతం గ్రామాల్లో మొబైల్​ కనెక్టివిటీ
  • తవ్వకాలకు కాల్ బిఫోర్ యు డిగ్ యాప్ : సీఎస్​ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 97.7% గ్రామాలు మొబైల్ కనెక్టివిటీతో ఉన్నా యని సీఎస్​ శాంతికుమారి తెలిపారు. దేశంలో 5జీని ప్రారంభించిన అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. సీఎస్​అధ్యక్షతన మంగళవారం స్టేట్ బ్రాడ్‌‌‌‌బ్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్ డిపార్ట్‌‌‌‌ మెంటల్ సమస్యలపై చర్చించారు. అనేక టెలికాం సూచికలలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని సీఎస్​ పేర్కొన్నారు. 

దాదాపు 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107%) దేశంలోనే అత్యధికంగా ఉందన్నారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న రైట్ ఆఫ్ వే దరఖాస్తుల పరిస్థితిపై సమావేశంలో సమీక్షించారు. 5జీ సేవలను వేగవంతం చేసేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ రకమైన తవ్వకాలకైనా “కాల్ బిఫోర్ యు డిగ్” (సీబీయూడీ) యాప్ ద్వారా ముందస్తు సమాచారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ఇంజినీరింగ్ విభాగాలు ముందుగా యాప్‌‌‌‌ను ఉపయోగించేలా ఆదే శాలు జారీ చేయాలని సీఎస్​ కోరారు.