ఫోన్ లేని విద్యార్థుల కోసం ఉచిత మొబైల్ ఫోన్ లైబ్రరీ

ఫోన్ లేని విద్యార్థుల కోసం ఉచిత మొబైల్ ఫోన్ లైబ్రరీ

కరోనావైరస్ కారణంగా పాఠశాలలన్నీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే క్లాసుల కోసం మొబైల్ ఫోన్లు కొనలేని పేద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికోసం ముంబై మున్సిపల్ & ప్రైవేట్ ఉర్దూ టీచర్స్ యూనియన్ వినూత్నంగా ఆలోచించింది. ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థుల కోసం ఇమామ్‌వాడ ప్రాంతంలో ఉచిత మొబైల్ ఫోన్ లైబ్రరీని ప్రారంభించింది. మొబైల్ ఫోన్ కొనలేని పేద విద్యార్థులు ఇక్కడ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఈ సదుపాయాన్ని ఇప్పటివరకు 22 మంది విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు.

‘కొంతమంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు లేవు. వారి కుటుంబంలో ఒక్కరికే మొబైల్ ఫోన్ ఉంది. అలాంటి వారి కోసం మేం దీన్ని ప్రారంభించాం. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో బోధిస్తుండటంతో విద్యార్థల సిలబస్ పూర్తవుతోంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఇక్కడ కూడా మేం కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాం’ అని ఇమామ్‌వాడ సెంటర్ సెంటర్ ఇన్‌ఛార్జ్ షాహినా సయీద్ తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 10 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా వైఫై సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.

For More News..

ప్రత్యర్థి మీద కోపంతో తనపై తానే ఫైరింగ్ చేయించుకున్న పూజారి

రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు