అందం కోసం లక్షలు ఖర్చు పెట్టాడు... ఆతర్వాత ఏమైందంటే..

అందం కోసం లక్షలు ఖర్చు పెట్టాడు... ఆతర్వాత ఏమైందంటే..

కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందట.. అన్న చందంగా ఓ వ్యక్తి దంతాలు వంకరగా ఉన్నాయని  ట్రీట్ మెంట్ కోసం పరాయి దేశం వెళ్లాడు. సీన్ కట్ చేస్తే  అతని ముఖం చూసి అతనే భయపడ్డాడు.  దీంతో ఎందుకొచ్చానురా బాబూ అంటూ తన బాధను వెళ్లగక్కాడు. 

అందంగా కనపడాలని మాంచెస్టర్  దేశానికి చెందిన జాక్ జేమ్స్ (22) తన వంకర పళ్లను సరిచేయించాలనుకున్నాడు.  దూరపు కొండలు నునుపు అన్న చందంగా మాంచెస్టర్ నుంచి బ్రిటన్ వెళ్లాడు.  దీని ట్రీట్మెంట్ కు 20 లక్షల రూపాయిలు అవుతుందని వైద్యులు చెప్పడంతో...అక్కడి నుంచి టర్కీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ట్రీట్ మెంట్ తీసుకున్నాడు.  ఆ వైద్యం రూ. 3 లక్షలయిందని జాక్ తెలిపారు.  టర్కీలో ట్రీట్ మెంట్  పూర్తయిన తరువాత అందమైన పళ్ల మధ్యలో షార్క్ ( ఇన్ ఫెక్షన్) కనపడింది.  దీంతో జాక్ చాలా ఇబ్బంది పడ్డాడు.  వెంటనే మరలా డాక్టర్ ను సంప్రదించగా.. దంతాల లోపల ఇన్ ఫెక్షన్ ఉందని చెప్పారు.   

 జేమ్స్ మళ్లీ డబ్బు చెల్లించి ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. చికిత్స తర్వాత  అతని పళ్లను  చూసుకున్న  జాక్ జేమ్స్  భయపడ్డానన్నాడు.  అతని  దంతాలు కత్తిరించడంతో..  హర్రర్ సినిమాలాగా ఉందన్నారు. ఇక జాక్  కు  ఏమి చేయాలో అర్థం కాక మళ్లీ  డాక్టర్‌ని సంప్రదించాడు. .. దాన్ని సరిచేయాలంటే మళ్లీ డబ్బులు చెల్లించాలని దాని ఖరీదు  4 లక్షల 50 వేల రూపాయిలని చెప్పారు.  అదే బ్రిటన్ లో అయితే 20  లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 

డెంటల్ ట్రీట్ మెంట్ కు  టర్కీకి వెళ్లవద్దంటూ.. ఒక వేళ వెళ్తే చాలా ఆలోచించి వెళ్లాలని  జేమ్స్ సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు అతని పళ్లను బయటకు లాగాలనిపిస్తోందన్నాడు జేమ్స్. దశాబ్దాలుగా, బ్రిటన్ ప్రజలు  వైద్యం కోసం టర్కీకి ,  తూర్పు యూరప్,  ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలకు చౌకగా శస్త్రచికిత్స చేయడానికి వెళుతుంటారు. అయితే ఒక్కోసారి అక్కడి వైద్యం చాలా  భయంకరంగా మారుతుందని జేమ్స్ తన అనుభవాన్ని తెలిపాడు. 

చూశారా.. అందంకోసం అక్కర్లేని ట్రీట్ మెంట్ చేయించుకున్న జేమ్స్ పరిస్థితి  ఎలా ఉందో.. అతనిని చూసి ఆయనే భయపడే స్థితికి వచ్చాడు.  అందం కోసం డబ్బు ఖర్చు లేని పోని కష్టాలను తెచ్చుకోవద్దు.