
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్కోవాలని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులుంటాయని, ఒక్కో కాలేజీలో ఒక్కో గ్రూపులో 40 సీట్లు ఉంటాయని చెప్పారు.
ఈ నెల 22న స్కూళ్లవారీగా అప్లై చేసినవారి లిస్టులు రిలీజ్ చేస్తామని, 26న సెలక్షన్ లిస్టు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 27 నుంచి 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. జూన్ 2 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. http://183.82.97.97/mstg యూఆర్ఎల్ ద్వారా అప్లయ్ చేస్కోవాలని విద్యార్థులకు సూచించారు.