మోదీ, షా దేశ ద్రోహులు.. కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని తాకట్టుపెట్టారు: రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ

మోదీ, షా దేశ ద్రోహులు.. కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని తాకట్టుపెట్టారు: రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ
  • రాజ్యాంగంపై నిరంతరం దాడి చేస్తున్నారు.
  • ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచారు..
  • వారివల్ల దేశంలో ఆర్థిక తుఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంచుకొస్తున్నది..
  • త్వరలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది..
  • దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుంటే...
  • విదేశాలకు అంబానీ ఇంధనం ఎగుమతి.. మోదీపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్​

రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలి:రాష్ట్రీయ స్వయం సేవక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తోపాటు  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా..  రాజ్యాంగంపై నిరంతరం దాడి చేస్తున్నారని, కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారిని దేశ ద్రోహులుగా అభివర్ణించారు.

యూపీలోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలి పర్యటనలో రెండో రోజైన బుధవారం, స్థానిక విప్లవ వీరుడు వీర పాసి స్మారకార్థం నిర్వహించిన ‘బహుజన్ స్వాభిమాన్ సభ’లో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ మాట్లాడారు. ‘‘మీరు మేల్కొని పోరాడాల్సిన సమయం వచ్చింది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యకర్తలు మీ ఇండ్ల మీదకు వచ్చి నరేంద్ర మోదీ, అమిత్ షాల గురించి మాట్లాడితే.. వారి సంస్థ, మోదీ, షాలు దేశద్రోహులని ముఖం మీదే చెప్పండి.

మన దేశాన్ని అమ్ముకోవడానికి, రాజ్యాంగాన్ని, అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలను దెబ్బతీయడానికి వారు ప్రయత్నిస్తున్నారు” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ (ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈజీఏ) పథకాన్ని బలహీనపరచడం, కుల గణన చేపట్టకపోవడం, ఎంపిక చేసిన కొద్దిమంది పారిశ్రామికవేత్తలకే కొమ్ముకాయడం ద్వారా ప్రధాని మోదీ 24 గంటలూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ఇంధన వినియోగం, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ.. దేశంపై పెద్ద  ఆర్థిక తుఫాను ముంచుకొస్తోందని  హెచ్చరించారు. ‘‘రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మీ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ధరల పెరుగుదల ఉంటుంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది..

ఇరాన్-–అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగి, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు, కిరోసిన్ కొరతతో సామాన్యులు అల్లాడిపోతారని.. కానీ ఈ ఆర్థిక సంక్షోభం అంబానీ, అదానీలను ఏమాత్రం తాకదని ఎద్దేవా చేశారు.

ఎన్నికల ముందు పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగవని, కొరత ఉండదని ప్రజలకు హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని మోదీని రాహుల్ విమర్శించారు. ‘‘ఈ రోజు దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుంటే, అంబానీ మాత్రం ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి విదేశాల్లో విక్రయిస్తున్నారు. ఆ డబ్బునే నరేంద్ర మోదీకి నిధులుగా సమకూరుస్తున్నారు”అని ఆరోపించారు. వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఈ సంక్షోభ ప్రభావం కనిపిస్తుందని, ఆ సమయంలో ప్రధాని మోదీ టీవీల్లో కనిపిస్తూ.. కరోనా, నోట్ల రద్దు సమయాల్లో ఏడ్చినట్లే ఏడుస్తూ తన తప్పేమీ లేదని అంటారని ఎద్దేవా చేశారు.

కానీ అసలు తప్పు మోదీ, అమిత్ షా, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లదేనని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు ప్రజలను విదేశాలకు వెళ్లొద్దని చెబుతూనే, మోదీ మాత్రం ఐదు దేశాల పర్యటనకు వెళ్లడాన్ని రాహుల్ తప్పుపట్టారు.

వ్యవస్థల ధ్వంసం.. ఓట్ల తొలగింపు!

దేశానికి లౌకికత్వం, సమానత్వం, న్యాయం చాలా కీలకమని.. కానీ..రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, స్వతంత్ర న్యాయవ్యవస్థతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందని రాహుల్ ఆరోపించారు. స్వతంత్ర మీడియా అస్తిత్వాన్ని ముగించేశారని, దేశ ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీలతో పాటు అమెరికా చేతుల్లో పెట్టారని విమర్శించారు. సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ తెలియని, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ భావజాలం ఉన్నవారినే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు.

చివరికి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల పేరిట కోట్లాది మంది ఓట్లను తొలగిస్తూ, రాజ్యాంగం కల్పించిన ‘ఒక వ్యక్తి -–ఒక ఓటు’ హక్కును కాలరాస్తున్నారని, తమకు ఓటు వేయని వారి పేర్లను లిస్టుల నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు.

అంబేద్కర్, వీర పాసి, గాంధీజీ విగ్రహాలకు చేతులు జోడించి దండం పెడితే సరిపోదని, వారి భావజాలాన్ని రక్షించుకున్నప్పుడే వారికి ఇచ్చే గౌరవానికి అర్థం ఉంటుందని రాహుల్ అన్నారు. కేవలం నినాదాల వల్ల ఏమీ సాధించలేమని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసికట్టుగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.