
81 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల ఉచిత ఆహారధాన్యాలు అందించే 'ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఇది జనవరి 1, 2024 నుండి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద, కేంద్రం.. జనవరి 1, 2023 నుండి PMGKAY కింద అంత్యోదయ అన్న యోజన (AAY) గృహాలు, ప్రాధాన్యతా గృహాల (PHH) లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తోంది.
2022 డిసెంబర్‌లో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)లో పీఎంజీకేఏవైని విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అదనపు ఆహార ధాన్యాలను ఉచితంగా అందించడానికి 2020లో PMGKAY ప్రారంభించారు. NFSA కింద, గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం కేటాయించగా అందులో అంత్యోదయ అన్న యోజన (AAY), ప్రాధాన్యతా గృహాలు అనే రెండు వర్గాలుగా విభజించారు.
Also Read:- ఆర్థిక సాయం.. కార్మికులకు రూ.1లక్ష చెక్కులను అందించిన ధామి