ఆధ్యాత్మిక నిలయాలు స్టార్టప్ లకు స్ఫూర్తినివ్వాలి

ఆధ్యాత్మిక నిలయాలు స్టార్టప్ లకు స్ఫూర్తినివ్వాలి

దేశంలోని స్టార్టప్ లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఆన్ లైన్ వేదికగా మాట్లాడారు. అందరి కోసం పాటు పడాలంటూ మన సాధువులు ఎల్లప్పుడూ ప్రజల్లో స్ఫూర్తి నింపారని అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామి జీవితం సైతం సమాజ సేవ, దాన ధర్మాలతో నిండి ఉందన్నారు. 

దేశాభివృద్ధి కోసం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే మంత్రంతో సమిష్టిగా కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  ‘దేశ అమృతోత్సవాల సందర్భంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకలను నిర్వహించుకుంటున్నాం, స్వార్థానికి తావులేకుండా ప్రజా సేవకు అంకితం కావాలని మన ఆధ్యాత్మికవేత్తలు మనలో ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తారు’ అని అన్నారు. మరో నెల రోజుల్లో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావించారు. యోగా, యువత.. ఈ రెండు నేడు భారత్ కు గుర్తింపుగా మారాయని ప్రధాని మోడీ అన్నారు. 

https://twitter.com/narendramodi/status/1528252277168799744

మరిన్ని వార్తల కోసం..

రేపు జపాన్కు వెళ్లనున్న పీఎం మోడీ
రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కాశ్మీర్ యువకుడు..ఎలానో తెలుసా ?