చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జి ఇదే

చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జి ఇదే

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా నిర్మించబడ్డ చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించారు ప్రధాని మోడీ.. చీనాబ్ రైల్వే బ్రిడ్జిగా పిలుస్తున్న ఈ బ్రిడ్జిని శుక్రవారం ( జూన్ 6 ) ఉదయం ప్రారంభించారు మోడీ. అనంతరం శ్రీనగర్ - బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. 

కాశ్మీర్ లోయకు ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందించే 272 కిలో మీటర్ల ఉధంపూర్–-శ్రీనగర్–-బారాముల్లా రైల్వే లింక్ పూర్తయినందుకు గుర్తుగా వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు మోడీ. అలాగే, దేశ ఇంజినీరింగ్ నైపుణ్యానికి చిహ్నమైన చీనాబ్ వంతెనతోపాటు అంజిఖాడ్​లో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జిని ప్రారంభించారు మోడీ.

చీనాబ్ బ్రిడ్జి ప్రత్యేకతలు:

  • చీనాబ్ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే చాలా ఎత్తైనది.. ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు కాగా.. చీనాబ్ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.
  • ఈ బ్రిడ్జిని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో నిర్మించారు. దీని పొడవు 1 వెయ్యి 315 మీటర్లు.
  • 266కిలోమీటర్ల గాలివీచినా  కూడా ఈ బ్రిడ్జి చెక్కుచెదరదు.
  • ఈ బ్రిడ్జి నిర్మాణంలో బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీల్, కాంక్రీట్ వాడటం వల్ల బాంబు దాడులను సైతం తట్టుకొని నిలబడుతుంది.

ఇదిలా ఉండగా.. ప్రధాని మోడీ కాశ్మీర్ పర్యటనలో భాగంగా..  త్రికూట కొండలపై ఉన్న వైష్ణో దేవి మందిరాన్ని సందర్శించే యాత్రికుల బేస్ క్యాంప్ అయిన కత్రాలో రూ.46 వేలకు కోట్లకు పైగా విలువైన  మల్టీ డెవలప్​మెంట్ ప్రాజెక్టులకు  శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. కాగా, మోదీ ప్రారంభించనున్న కత్రా–శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు సర్వీసు జూన్ 7 నుంచి అందుబాటులోకి వస్తుందని ఉత్తర రైల్వే తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఐఆర్ సీటీసీ  ముందస్తు బుకింగ్ ప్రారంభించింది. కాత్రా– శ్రీనగర్ మధ్య రెండు వందే భారత్ రైళ్లు  4  ట్రిప్పులు నడపనున్నట్టు పేర్కొన్నది.