
- మళ్లీ ఆలయం నిర్మించేందుకే వస్తా: 1991లో చెప్పిన మోడీ
- వైరల్ అవుతున్న అప్పటి ఫొటో
అయోధ్య: ఎన్నో ఏళ్లుగా హిందువులు ఎదురుచూస్తున్న కార్యక్రమం ఆగస్టు 5న సాకారం కానుంది. రామమందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధానికి చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్య మూమెంట్ ముమ్మరంగా జరుగుతున్న సమయంలో 1991లో మురళీమనోహర్ జోషీతో అయోధ్యకు వచ్చిన మోడీ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయోధ్యలోని ఒక ఫొటోగ్రాఫర్ దాన్ని క్లిక్‌మనిపించాడు. అతను ప్రస్తుతం అయోధ్య ప్రాంతంలోనే స్టూడియోను నడుపుతున్నారు. అస్పట్లో వీహెచ్‌పీకి ఉన్న ఏకైక ఫొటోగ్రాఫర్ మహేంద్ర తిపాఠి. “ 1991లో మురళీ మనోహర్ జోషీతో మోడీ అయోధ్యకు వచ్చారు. ఆ సమయంలో గుజరాత్ నుంచి వచ్చిన బీజేపీ నేత అని మోడీని పరిచయం చేశారు. ఆ టైంలో మోడీని ఇంటర్వ్యూ చేసిన విలేకర్లు మళ్లీ అయోధ్యకు ఎప్పుడు వస్తారు అని ప్రశ్నించగా.. మందిర నిర్మాణానికి వస్తాను అని మోడీ చెప్పారు. ఇప్పుడు ఆయన తన ప్రామిస్ నిలబెట్టుకున్నారు” అని ఫొటో తీసిన మహేంద్ర త్రిపాఠి అన్నారు. ఆ టైంలో ఫొటో తీయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.