అబుదాబీ టవర్స్‌పై మోడీ

అబుదాబీ టవర్స్‌పై మోడీ

మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సంధర్భంగా అబుదాబిలో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. దీంతో అబుదాబిలోని అడ్‌నోక్ గ్రూప్ టవర్లపై భారత జాతీయ మువ్వన్నెల జెండాతో పాటు ఆ దేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

అలాగే ఆ దేశ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్ నహ్యాన్‌తో మోడీ షేక్ హ్యాండ్ ఇస్తున్నఫొటోను కూడా ప్రదర్శించారు. ఈ అరుదైన ఘటనతో భారత్‌తో తమకున్న స్నేహబంధాన్ని UAE ప్రభుత్వం చాటి చెప్పింది. ఈ ఫొటోల వీడియోను అబుదాబీ భారత రాయబారి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.