రైతుల మేలు కోసమే అగ్రి బిల్లులు తీసుకొచ్చాం

రైతుల మేలు కోసమే అగ్రి బిల్లులు తీసుకొచ్చాం
  • 68వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ:   కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్రి బిల్లులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం 68వ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రాంలో మోడీ మాట్లాడారు. కేంద్రం తెచ్చిన అగ్రికల్చర్ బిల్లులను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, పలు రాష్ట్రాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ విషయంపై వివరణనిచ్చారు. కరోనా విపత్తులో సైతం మనదేశ అగ్రికల్చర్ సెక్టార్ ఏమాత్రం బలహీనం కాలేదని, ఇది మన రైతుల బలాన్ని చాటి చెబుతుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ (సెల్ఫ్ రిలయంట్ ఇండియా)కు రైతులు, అగ్రికల్చర్ సెక్టారే పునాది అని కొనియాడారు. రైతులు బలంగా ఉంటే.. దేశం కూడా బలంగా ఉంటుందన్నారు. రైతులను ఎంపవర్ చేసేందుకే అగ్రి బిల్లులను తెచ్చామని, వీటి వల్ల రైతులు తమ ఉత్పత్తులను ఎవరికైనా, ఎక్కడైనా మంచి ధరలకు అమ్ముకోవచ్చన్నారు.

పండ్ల రైతులకు మేలు జరిగింది..  

కొన్ని రాష్ట్రాల్లో పండ్లు, కూరగాయలు పండించే రైతులను కొన్నేళ్ల కిందటే.. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) యాక్ట్ నుంచి బయటకు తేవడంతో వారికి ఎంతో మేలు జరిగిందని ప్రధాని మోడీ చెప్పారు. ‘‘హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్​లో కొన్నేండ్ల కిందటే..  ఏపీఎంసీ యాక్ట్ నుంచి తప్పించడంతో పండ్లు, కూరగాయల రైతులు లాభపడ్డారు. రైతులే సంఘాలుగా ఏర్పడి దళారుల కబంధహస్తాల నుంచి బయటపడ్డారు. తమ ఉత్పత్తులను ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు పండ్లు, కూరగాయలే కాదు.. వడ్లు, గోధుమలు, ఆవాలు, చెరకు వంటి పంటలను.. మంచి ధరలకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు” అని మోడీ చెప్పారు. రైతులకు మేలు చేసే ఇలాంటి చర్యలను కొందరు ‘యాంటీఫార్మర్‌‌‌‌‌‌‌‌’ విధానాలని విమర్శిస్తున్నారన్నారు.

గాంధీని ఫాలో అయి ఉంటే..

కేంద్ర ప్రభుత్వం కరోనాను హ్యాండిల్ చేస్తున్న తీరు, ఎకనమిక్ పాలసీలను అమలు చేస్తున్న విధానంపై కాంగ్రెస్ విమర్శలను మోడీ తిప్పికొట్టారు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచీ మహాత్మా గాంధీ సూచించిన ‘అగ్రికల్చర్ కేంద్రంగా ఎకనమిక్ ఫిలాసఫీ’ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించి ఉంటే.. దేశం చాలా ఏళ్ల కిందటే సెల్ఫ్​ రిలయంట్ ఇండియాగా మారేదన్నారు.

ప్రతి ఫ్యామిలీ కథలు చెప్పుకోవాలి..

కథలు చెప్పుకోవడం(స్టోరీ టెల్లింగ్) అనేది మనదేశానికి శతాబ్దాల నుంచీ ఉన్న గొప్ప ట్రెడిషన్ అంటూ..  ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ స్పీచ్ ను ప్రారంభించారు. నేటి కరోనా విపత్తు కాలంలో స్టోరీ టెల్లింగ్​కు ప్రాముఖ్యం పెరిగిందన్నారు. ఇప్పుడు సైన్స్ కథలకు పాపులారీటీ ఎక్కువగా ఉందన్నారు. ప్రతి కుటుంబమూ కథలు చెప్పుకునేందుకు కొంత టైం కేటాయించాలని, ఇది వారికి అద్భుతమైన ఎక్స్​పీరియెన్స్ అవుతుందన్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తుల కథలు మన స్టూడెంట్లకు ఎంతో అవసరమన్నారు.

గాంధీజీ తదితరులకు నివాళి..

కొద్దిరోజుల్లో రానున్న గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి, విజయరాజే సింధియా, జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్ ముఖ్, భగత్ సింగ్ వంటి పలువురు ప్రముఖుల బర్త్, డెత్ యానివర్సరీలను కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారందరి కీ ముందస్తుగా నివాళిఅర్పిస్తున్నానని తెలిపారు. కరోనా వ్యాప్తి కొనసాగు తున్న నేపథ్యంలో ప్రజలంతా మాస్కు లు పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన కోరారు.