2024లోనూ ప్రధానిగా మోడీనే రావాలి : మధురై అధీనం ప్రధాన అర్చకుడు

2024లోనూ ప్రధానిగా మోడీనే రావాలి : మధురై అధీనం ప్రధాన అర్చకుడు

మే 28న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్బంగా సెంగోల్ ను మధురై అధీనం 293వ ప్రధాన అర్చకుడు శ్రీ హరిహర దేశిక స్వామిగల్ అందజేయనున్నాపు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని తాను కలుస్తానని, సెంగోల్ ను బహూకరిస్తానని ఆయన చెప్పారు. దాంతో పాటు ఆయన 2024లో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి రావాలని స్వామిగల్ ఆకాంక్షించారు. ప్రపంచ నాయకుడు ప్రధాని మోడీని అభినందిస్తున్నందుకు గర్వంగా ఉందన్న ఆయన.. మోడీ ప్రజలుకు మంచి పనులు చేస్తున్నారని చెప్పారు. 2024లో ఆయన మళ్లీ ప్రధాని అయ్యి ప్రజలకు మార్గ దర్శకత్వం వహించాలని కోరారు.

కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ కుర్చీకి సమీపంలో రాజదండమైన సెంగోల్ ను ప్రధాని మోడీ ఏర్పాటు చేయనున్నారు. బ్రిటీష్ నుంచి భారత్ కు అధికార మార్పిడికి గుర్తుగా సెంగోల్ ను బ్రిటీష్ వారు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ప్రధాని దేవె గౌడ మే 28న మధ్యాహ్నం జరగబోయే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కానున్నట్టు సమాచారం. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్ సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పలువురు ప్రతిపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.