రేపే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

రేపే రైతుల ఖాతాల్లోకి  పీఎం కిసాన్  డబ్బులు

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు(అక్టోబర్ 17)  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత డబ్బులను రైతుల ఖాతల్లో జమ చేయనుంది. 12 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున మొత్తం రూ.16,000 కోట్లను  బదిలీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11గంటలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని రిలీజ్ చేయనున్నారు.  

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా సహాకారం అందించేందుకు  కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో పీఎం కిసాన్ నిధి యోజన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆరు వేల రూపాయలను మొత్తం  మూడు విడతల్లో రైతులకు అందిస్తుంది. ఇప్పటివరకు 11 విడతలుగా రూ . 2 వేల చొప్పున  రైతుల ఖాతల్లో జమయ్యాయి. 11 వ విడతను 2022 మే నెలలో ప్రధాని మోడీ విడుదల చేశారు.  10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ. 21,000 కోట్ల మొత్తాన్ని బదిలీ చేశారు.