మోదీ హామీలు ఎన్నికల వాగ్దానాలు కావు.. ప్రతీ హామీ వాస్తవ రూపం దాల్చింది: మోదీ

మోదీ హామీలు ఎన్నికల వాగ్దానాలు కావు.. ప్రతీ హామీ వాస్తవ రూపం దాల్చింది: మోదీ

మోదీ హామీలు ఎన్నికల వాగ్దానాలు కావు.. మోదీ హామీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం హర్యానాలోని క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్‌లో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ హయాంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని విమర్శించారు. ఏ రంగంలోనైనా పెను మార్పులు తీసుకురాగల శక్తి జిల్లా పంచాయతీకి ఉందన్నారు. గ్రామాల్లో పంచాయతీరాజ్‌ను అమలు చేయడం ఎంత ముఖ్యమో కాంగ్రెస్‌కు తెలియదని ప్రధాని మోదీ విమర్శించారు. 

హర్యానాలోని క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు. అమృత్ కాల్ తీర్మానాలను అమలు చేసేందుకు, భారత్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నామన్నాని మోదీ అన్నారు. వివిధ రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు  జిల్లా పంచాయితీలు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. 

 ఈ సమావేశంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.  స్వాతంత్య్రం వచ్చిన నాలుగు దశాబ్దాలుగా గ్రామాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.  జిల్లా పంచాయతీ వ్యవస్థ కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు.  ఫలితంగా  దేశంలోని మూడింట రెండొంతుల జనాభా గ్రామాలలో నివసిస్తున్నారని విమర్శించారు. రోడ్లు, విద్యుత్, నీరు, బ్యాంకులు , ఇళ్ళు వంటి ప్రాథమిక అవసరాల కోసం ప్రజలు ఇంకా ఎదురు చూడటం దురదృష్టకరం అన్నారు.  స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా దేశంలోని దాదాపు 18,000 గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేకపోవడానికి కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణమని ప్రధాని మోదీ అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తరువాత  ఈ ప్రాంతం గ్రామ పంచాయితీ నుండి జిల్లా స్థాయి వరకు మొట్టమొదటి ఎన్నికలను చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఎన్నికలలో 33,000 మందికి పైగా స్థానిక ప్రతినిధులు విజయవంతంగా ఎన్నికయ్యారని.. ఇది జమ్మూ కాశ్మీర్ లో మొదటిసారిగా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం స్థాపించబడిందని ప్రధాని మోదీ అన్నారు.