బిల్​గేట్స్​కు మోడీ సూచన

బిల్​గేట్స్​కు మోడీ సూచన

న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్​ను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. అమెరికన్ చెఫ్​తో కలిసి బిల్​గేట్స్ రోటీ తయారు చేసిన వీడియో వైరల్ కాగా, అది మోడీ దృష్టికి వచ్చింది. దీంతో మీరు సూపర్ అంటూ మోడీ కూడా ఆ వీడియోను తన ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. ఈసారి మిల్లెట్స్​తో ట్రై చేయండి అంటూ గేట్స్​కు సూచించారు. ‘సూపర్బ్.. ప్రస్తుతం ఇండియాలో మిల్లెట్స్​ ట్రెండ్ నడుస్తోంది. అవి చాలా ఆరోగ్యకరమైనవి. మిల్లెట్స్​తో చాలా వంటకాలున్నాయి. ఓసారి ట్రై చేయండి’ అని మోడీ బిల్​గేట్స్​కు సూచించారు. చెఫ్​ఐటన్ ఇటీవల బీహార్​లో పర్యటించి, గోధుమ రైతులను కలిశారని, అలాగే, ఓ క్యాంటీన్​లో మహిళలను కలిసి రోటీ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడని బిల్​గేట్స్​తెలిపారు.

రేపు కర్నాటకలో హెలికాప్టర్ ఫ్యాక్టరీ ప్రారంభం..

కర్నాటకలోని తుంకూరులో హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్​కు రెడీ అయ్యింది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోడీ ఫిబ్రవరి 6న ప్రారంభించనున్నారు.  దేశంలోని అన్ని హెలికాప్టర్ల అవసరాలను తీర్చే  వన్ స్టాప్ సొల్యూషన్‌‌‌‌‌‌‌‌  లక్ష్యంగా 615 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మించింది.  దేశంలో అతిపెద్ద హెలికాప్టర్ తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో మొదట స్వదేశీ పరిజ్ఞానంతో లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను తయారు చేస్తారు. ఏడాదికి  30 హెలికాప్టర్లను  తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆపై ఏడాదికి 60 నుంచి 90 వరకు తయారు చేస్తారు. ఇప్పటికే మొదటి లైట్ యుటిలిటీ హెలికాప్టర్లకు ఫ్లైట్ టెస్ట్ పూర్తి చేశారు.'