
క్రికెట్ లో కొత్త ఫ్యాబ్ 4 పై ఆసక్తి నెలకొంది. దశాబ్ధాకాలం పాటు క్రికెట్ లో ఫ్యాబ్-4గా కొనసాగిన విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్ ప్రాబల్యం తగ్గిపోవడంతో నెక్స్ట్ వీరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఫ్యాబ్ 4 గా పరిగణించే ఈ నలుగురు ప్రస్తుతం మూడు ఫార్మాట్ లు ఆడడం లేదు. వయసు పెరగడంతో పాటు వీరి రిటైర్మెంట్ సమయం దగ్గర పడుతుంది. దీంతో ఇప్పుడు భవిష్యత్ లో ఫ్యాబ్ 4 అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈ విషయంపై ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ మొయిన్ అలీ, స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాట్లాడుతూ తమ ఫ్యాబ్-4 ను ప్రకటించారు.
బియర్డ్ బిఫోర్ తో మాట్లాడుతూ.. నెక్స్ట్ ఫ్యాబ్ ఫోర్ పై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మొయిన్ అలీ టీమిండియా శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్ తో పాటు ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రలను తన ఫ్యాబ్ ఫోర్ గా ఎంచుకున్నాడు. ఐదో పేరుగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ ను తమ లిస్ట్ లో చేర్చాడు. రషీద్ మాట్లాడుతూ హ్యారీ బ్రూక్, శుభమాన్ గిల్, యశస్వి జైశ్వాల్, జాకబ్ బెతేల్ ను సెలక్ట్ చేశాడు. వీరిద్దరూ ఎంపిక చేసిన వారిలో కామన్ గా గిల్, జైశ్వాల్, బ్రూక్ ఉండడం విశేషం.
►ALSO READ | Asia Cup 2025: దులీప్ ట్రోఫీ ఆడగలిగితే.. ఆసియా కప్ ఆడలేనా: సెలక్టర్లకు షమీ సూటి ప్రశ్న
ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో భారత టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికైన గిల్.. అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లో 75.40 సగటుతో 754 పరుగులు చేసి ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో గిల్ నాలుగు సెంచరీలు చేయడం విశేషం. ఇదే సిరీస్ లో 411 పరుగులు చేసి జైశ్వాల్ ఆకట్టుకున్నాడు. బ్రూక్ విషయానికి వస్తే 481 పరుగులు ఈ టెస్ట్ సిరీస్ లో అదరగొట్టాడు. వీరు ముగ్గురు అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్నారు. ఇంగ్లాండ్ తరపున బెథెల్ 29 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడి ఫ్యూచర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర అన్ని ఫార్మాట్లలో 8 సెంచరీలు చేసి తాను భవిష్యత్ ఆశాకిరణం అని నిరూపించాడు.