
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు ఓ ఎస్ఐ. హైదరాబాద్ మొఘల్ పురా పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ పి.బాలు 30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ రహీం, అతని తమ్మున్ని బైండోవర్ కేసునుంచి RTOకు తెలువకుండా తప్పించేందుకు మొఘల్ పురా ఎస్ఐ బాలు 30వేలు డిమాండ్ చేశాడు. దీంతో రహీం ఏసీబీ అధికారులను ఆవ్రయించాడు.
30వేల లంచాన్ని రహీం ఎస్ఐ బాలు కు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాలు చేతులను రసాయనాలతో కడిగితే ఎడమ చేతి వేళ్లు రంగుమారాయి. దీంతో బాలును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. మీడియాతో మాట్లాడిన ఏసీబీ అధికారులు.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 లనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.