మైనార్టీ సంక్షేమ మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు

మైనార్టీ సంక్షేమ మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన చాంబర్ లో ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఫకీర్ రిహాబిలిటేషన్ ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అజారుద్దీన్ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ కు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.