డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: మంత్రి అజారుద్దీన్

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: మంత్రి అజారుద్దీన్

మెహిదీపట్నం, వెలుగు: డ్రగ్స్​కు యువత దూరంగా ఉండాలని మంత్రి అజారుద్దీన్ పిలునిచ్చారు. శనివారం టప్పాచబుత్ర పరిధిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

డ్రగ్స్​కు బానిసైతే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సందీప్ శాండిల్య, గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.