Mohammad Nabi: సన్ రైజర్స్ పై నబీ సంచలన వ్యాఖ్యలు

Mohammad Nabi: సన్ రైజర్స్ పై నబీ సంచలన వ్యాఖ్యలు

సన్ రైజర్స్పై అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సన్ రైజర్స్ తరపును ఆడటానికి చాలా మంది ఆటగాళ్లు ఇంట్రెస్ట్ చూపట్లేదని అన్నాడు. స్పోర్ట్స్ యారీ యూట్యూబ్ చానెల్ తో  మాట్లాడిన నబీ..  ఆ జట్టు ప్రాంఛైజీ  తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ప్లేయర్స్  సన్ రైజర్స్ తో ఉండటానికి ఇష్టపడటం లేదన్నాడు. చాలా మంది అసంతృప్తిగానే జట్టులో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించాడు.

జట్టును నాశనం చేసిన్రు

అనసవర మార్పులతో  సన్ రైజర్స్ యాజమాన్యం జట్టును నాశనం చేశారని నబీ ఆరోపించాడు. రషీద్ ఖాన్, తాను జట్టులో చేరినప్పుడు అద్భుతంగా ఉండేది కానీ గత రెండేళ్ల నుంచి జట్టులో చాలా మార్పులు జరిగాయని...దీంతో డ్రెస్సింగ్ రూం వాతావరణమే మారిపోయిందన్నాడు.  ఐదేళ్ల పాటు జట్టుకు అంబాసిడర్ గా ఉన్న రషీద్ ఖాన్ ను వదిలేశారని.. అతడితో పాటు మంచిగ ఆడే ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లను కూడా జట్టు వదులుకుందని చెప్పుకొచ్చాడు.

అన్ సోల్డ్ లిస్టులో నబీ

2017 నుంచి 2021 వరకు నబీ సన్ రైజర్స్ కు ఆడిండు. 2022లో  కేకేఆర్ అతడిని కోటి రూపాయలకు కొనుగోలు చేసి ఇటీవల వదిలేసింది.  ఇటీవల జరిగిని మినీ వేలంలో అతడిని ప్రాంఛైజీలు కొనడానికి ఆసక్తి చూపలేదు.  మినీ వేలంలో  సన్‌రైజర్స్ మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింద. అత్యధికంగా ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ను రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL 2023  సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు

హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, వివ్రంత్ శర్మ, ఆదిల్ రషీద్, మయాంక్ డాగర్, అకేల్ హోసేన్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అన్మోల్‌ప్రీత్ సింగ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫరూకీ, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.