
దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో భారత్ ఫీల్డింగ్ లో తడబడుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. క్యాచ్ అందుకోవడంలో విఫలమవుతున్నాడు. పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్ ఈజీ క్యాచ్ మిస్ చేసిన షమీ.. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ క్యాచ్ మిస్ చేసి నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ 22 ఓవర్ నాలుగో బంతికి షమీ వేసిన బంతిని స్మిత్ నేరుగా ఆడడంతో బౌలింగ్ చేస్తున్న షమీ చేతుల్లోకి నేరుగా క్యాచ్ వచ్చింది. అయితే షమీ మాత్రం ఈజీ క్యాచ్ జారవిడిచారు. దీంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ బతికిపోయాడు.
ALSO READ | IND vs AUS: ట్రావిస్ హెడ్ కౌంటర్ అటాక్.. షమీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు
స్మిత్ 36 పరుగుల వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే బ్యాటింగ్ లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజ్ లో స్టీవ్ స్మిత్ (37), ఇంగ్లిస్ (2) ఉన్నారు. హెడ్ ఉన్నంతసేపు వేగంగా ఆడి 33 బంతుల్లో 39 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యాడు. భారత్ బౌలర్లలో షమీ, వరుణ్ చక్రవర్తి, జడేజాలకు తలో వికెట్ లభించింది.