షమీకి కొవిడ్...ఆసీస్ సిరీస్కు దూరం

షమీకి కొవిడ్...ఆసీస్ సిరీస్కు దూరం

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. దీంతో  సెప్టెంబర్ 20 నుంచి మొదలు కానున్న ఆస్ట్రేలియా టీ20 సిరీస్కు అతను దూరమయ్యాడు. దీంతో షమీ ప్లేస్లో ఉమేష్ యాదవ్ను తీసుకునే ఛాన్సుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 

రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి..
మహ్మద్ షమీ దాదాపు రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. అతను 2021కంటే ముందు టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్లో గుజరాత్ తరపున ఆడాడు. మొత్తం 16 మ్యాచుల్లో 20 వికెట్లు దక్కించుకున్నాడు. అంతేకాకుండా గుజరాత్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. 

షమీని వెంటాడుతున్న దురదృష్టం..
టీమిండియాలో అనుభవం ఉన్న పేసర్లలలో షమీ ఒకడు. అయితే ఇంత అనుభవం కలిగి ఉన్నా..అతను ఐపీఎల్లో  రాణించినా..అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో మాత్రం ఆడటం లేదు. ఇటీవలే జరిగిన ఆసియాకప్లో బీసీసీఐ అతన్ని ఎంపిక చేయలేదు. కేవలం వన్డేలు, టెస్టులకే పరిమితం చేసింది.  దీనిపై విమర్శలు చెలరేగడంతో..టీ20 వరల్డ్ కప్ కోసం స్టాండ్ బై ప్లేయర్గా  బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్లోనూ చోటిచ్చింది. మరో రెండు రోజుల్లో సిరీస్ మొదలవనున్న నేపథ్యంలో...అతను కరోనా బారిన పడ్డాడు. 


 
సౌతాఫ్రికా సిరీస్కు దూరమవుతాడా..?
కొవిడ్ కారణంగా ప్రస్తుతం ఆసీస్తో సిరీస్కు దూరమైన షమీ.. సౌతాఫ్రికా సిరీస్కు అయినా అందుబాటులో ఉంటాడా అని అనుమానం వ్యక్తమవుతోంది. సౌతాఫ్రికా భారత్ మధ్య సెప్టెంబర్ 28 నుంచి మూడు టీ20 మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది. అప్పటిలోగా కోలుకుని..ఈ సిరీస్కు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.