ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ బరిలో సిరాజ్

ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ బరిలో సిరాజ్

దుబాయ్: ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్‌‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో చేసిన సూపర్ పెర్ఫామెన్స్ తో తనకు ఈ నామినేషన్ లభించింది. గాయాలతో పలువురు ఆటగాళ్లు దూరమైన ఈ సిరీస్‌‌లో, సిరాజ్ అన్ని ఐదు టెస్టుల్లోనూ ఆడి కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌‌లో అత్యధిక వికెట్లు (23) పడగొట్టిన బౌలర్‌‌గా నిలిచి సత్తా చాటాడు. జూన్ చివరి వారంలో మొదలై ఆగస్టులో ముగిసిన ఈ సిరీస్‌‌లో సిరాజ్ మొత్తం 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు.  సిరాజ్‌‌తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ మాట్ హెన్రీ, వెస్టిండీస్ ప్లేయర్‌‌ జేడెన్ సీల్స్‌‌ కూడా రేసులో ఉన్నారు.