
మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohan lal) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ వృషభ(Vrushabha). నందకిషోర్(Nanda kishore) దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో రోషన్(Roshan) కూడా కీ రోల్ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా జులై 23న లాంఛనంగా ప్రారంభమైంది.
ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి వృషభ సినిమా యూనిట్ తో పాటు.. హీరో శ్రీకాంత్(Srikanth) ఆయన భార్య ఊహ(Uha) కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను యూనిట్ అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శాన్యా కపూర్(Shanya kapoor), జరా ఖాన్(Zahrah khan) హీరోయిన్స్ గా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. పాన్ ఇండియా లెవల్లో, పీరియాడికల్ డ్రామాగా రానున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vrushabha takes its first step towards the frame! As the clapboard snaps shut for #Vrushabha, we ask for your love and blessings. pic.twitter.com/RM1uIkeJp2
— Mohanlal (@Mohanlal) July 23, 2023