Drishyam 3 Review: మరింత మైండ్ గేమ్ ట్విస్టులతో ‘దృశ్యం 3’.. జార్జ్‌కుట్టి మళ్లీ తప్పించుకున్నాడా?

Drishyam 3 Review: మరింత మైండ్ గేమ్ ట్విస్టులతో ‘దృశ్యం 3’.. జార్జ్‌కుట్టి మళ్లీ తప్పించుకున్నాడా?

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ఆడియన్స్కు ‘దృశ్యం 3’ ( Drishyam 3 ) ఒక ఎమోషన్. తెలుగుతో పాటు తెరకెక్కిన ప్రతి భాషలనూ ప్రేక్షకుల్లో పిచ్చా క్యూరియాసిటీ పెంచింది. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను తెరకెక్కించే విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఘనత ఈ ఫ్రాంచైజీది. ఇప్పుడు ఈ క్రేజీ సిరీస్‌లో మూడో భాగం ‘దృశ్యం 3’ ఇవాళ మే21, 2026న థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్, ప్రస్తుతానికి మలయాళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చిది. కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ నటించిన 'జార్జ్‌కుట్టి' పాత్ర ఈసారి ఎలాంటి చిక్కుముడులను పేర్చింది? జీతూ జోసెఫ్ ‘దృశ్యం 3’ కోసం ఎలాంటి మ్యాజిక్ చేశాడనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథనం రివైండ్:

డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ ఫ్రాంచైజీ కథేంటో అందరికీ తెలిసిందే. తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఈ కథను రీమేక్ చేసి సక్సెస్ కొట్టారు. మొదటి రెండు భాగాల్లో పోలీస్ కేసుల నుంచి తృటిలో తప్పించుకున్న జార్జ్‌కుట్టి ఫ్యామిలీ, ఈసారి ఎలాంటి చిక్కుల్లో పడబోతుంది? గతాన్ని పోలీసులు మళ్ళీ వెలికితీస్తారా? అనే ఉత్కంఠ కథనంతో డైరెక్టర్ జీతూ జోసెఫ్ వచ్చాడు. మిడిల్ క్లాస్ ఫాదర్ జార్జ్ కుట్టి (మోహన్ లాల్), అతని భార్య రాణి (మీనా), కూతుళ్లు అంజు (అన్సిబా హాసన్), అను (ఎస్తేర్ అనిల్) చుట్టూనే ఈ మూడో భాగం రాసుకున్నారు డైరెక్టర్. మొదటి రెండు భాగాలకు కొనసాగింపుగానే ‘దృశ్యం 3’ వస్తోంది. 

‘దృశ్యం 3’ కథ :

వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడేందుకు జార్జ్‌కుట్టి కొత్త ప్లాన్‌తో ముందుకొస్తాడు. తన కథనే సినిమాగా తీసి జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇందుకోసం ఓ రైటర్తో కథ రాయించి, తానే నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతాడు. దీంతో జార్జ్ కుట్టి లైఫ్‌స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె పెళ్లి విషయంలో కొత్త సమస్యలను ఎదుర్కొంటాడు. ఎన్ని సంబంధాలను చూసిన వెంట వెంటనే రిజెక్ట్ అవ్వడం సస్పెన్స్ కలిగిస్తాయి. ఎవరో కావాలనే సంబంధాలను చెడగొడుతున్నారని తెలుసుకున్న జార్జ్, ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కథలో ఉత్కంఠ పెరుగుతుంది.

అసలు జార్జ్‌కుట్టిని సహదేవ్ అనే ఒక కానిస్టేబుల్ ఎందుకు ఫాలో అవుతూ వస్తుండు? అంటే కొడుకును పోగొట్టుకున్న గీతా ప్రభాకర్ దంపతులు ప్రతీకారం కోసం మళ్ళీ ఎంట్రీ ఇచ్చారా? ఈసారి చట్టంలోని ఎలాంటి లోసుగులను వాడుకుంటూ జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు? అందుకు జార్జ్‌కుట్టి ఆడిన మైండ్ గేమ్ ఏంటి? అనేది ‘దృశ్యం 3’ మిగతా కథ.

విశ్లేషణ:

‘దృశ్యం 3’ ఫస్టాఫ్ నుంచే ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలను సమతుల్యంగా నడిపించిన దర్శకుడు, ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్పై మరింత ఆసక్తి పెంచారు.  కానిస్టేబుల్ సహదేవ్ పాత్రతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులతో ఆడియన్స్ను సీట్లో కూర్చోబెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

మోహన్‌లాల్ తన నటనతో మరోసారి జార్జ్‌కుట్టి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. దృశ్యం 1, దృశ్యం 2 ల  మాదిరిగానే ఈసారి కూడా కథలో టెన్షన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ మూడ్‌ను సినిమా నిలబెట్టిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా చూస్తే, ‘దృశ్యం 3’ మరోసారి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టే థ్రిల్లర్‌గా నిలిచే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. జార్జి కుట్టి (మోహన్ లాల్) ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం చెప్పే అబద్దాలు ఆసక్తి పెంచేలా ఉన్నాయని అంటున్నారు. కళ్లను, మైండ్‌ను దారి తప్పించేలా స్క్రీన్ ప్లే అదిరిపోయిందని రివ్యూలు ఇస్తున్నారు.

నటీనటుల పెరఫార్మన్స్

మోహన్‌లాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జార్జ్‌కుట్టి పాత్రలో ఆయన మరోసారి ఒదిగిపోయారు. కళ్లతోనే భావాలను పలికిస్తూ, తన కుటుంబం కోసం ఏ స్థాయికైనా వెళ్లే వ్యక్తిగా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషన్స్ సన్నివేశాలు, టెన్షన్ పడే మూమెంట్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

భార్య రాణి పాత్రలో మీనా తన పాత్రకు మరోసారి పూర్తి న్యాయం చేసింది. కుటుంబ పరిస్థితుల మధ్య భయం, ఆందోళన, భావోద్వేగాలను సహజంగా పలికించారు. కూతుళ్లుగా నటించిన అంజు, అను పాత్రధారులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

ALSO READ : గంటల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్..