DRAGON: 24 గంటల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. యూట్యూబ్‌లో ‘డ్రాగన్’ ఆల్‌టైమ్ రికార్డు వ్యూస్!

DRAGON: 24 గంటల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. యూట్యూబ్‌లో ‘డ్రాగన్’ ఆల్‌టైమ్ రికార్డు వ్యూస్!

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఫోటోలు, షార్ట్స్, రీల్స్ రూపంలో వైరల్ అవుతూ అభిమానుల్లో హైప్ పెంచుతోంది. అంతేకాదు, యూట్యూబ్‌లోనూ రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం అధికారికంగా గుడ్ న్యూస్ షేర్ చేసింది. కేవలం 24 గంటల్లోనే ‘డ్రాగన్’ గ్లింప్స్ 64 మిలియన్లకు (6కోట్ల 40 లక్షల)పైగా వ్యూస్ సాధించి, ఇండియాలో అత్యధిక వ్యూస్ పొందిన గ్లింప్స్‌గా రికార్డు నమోదు చేసుకున్నట్లు ప్రకటించింది.

‘‘ ‘డ్రాగన్’ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జస్ట్ 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధిస్తూ, ఇండియాలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న గ్లింప్స్‌గా చరిత్ర సృష్టించింది’’ అని మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ‘డ్రాగన్’ ఫైర్ ఇప్పుడు మొదలైందే తప్ప.. ఇంకా రికార్డుల వేట మిగిలే ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే, ట్రైలర్ ప్రకారం చూసుకుంటే: పెద్ది ట్రైలర్ 24 గంటల్లో 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఆల్ టైం బిగ్గెస్ట్ తెలుగు ట్రైలర్గా హిస్టరీ క్రియేట్ చేసింది.  

1967 నేపథ్యంలో సాగే ‘డ్రాగన్’ గ్లింప్స్ ఓ చీకటి ప్రపంచాన్ని కళ్ళకు కట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసారి కథను ముందుగానే మరింత లోతుగా వివరించే తీరు చూస్తే ఇదొక వ్యూహమని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే గోల్డెన్ ట్రైయాంగిల్ ప్రాంతంలోని ఓపియం (నల్లమందు) అక్రమ వ్యాపారాన్ని, అక్కడి క్రూరమైన విలన్స్‌ను పరిచయం చేసిన తీరు అట్ట్రాక్ట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అస్సాసిన్-ఇన్-చీఫ్‌గా కనిపించి అంచనాలు పెంచాడు. మొత్తం 4 నిమిషాల 29 సెకన్ల గ్లింప్స్ సినిమా కోసం వెయిట్ చేసేలా చేయడంలో సక్సెస్ అయింది.

ALSO READ : Chiranjeevi: మెగా 158 గ్రాండ్ లాంచ్‌.. అన్నయ్య కోసం వచ్చిన తమ్ముళ్లు.. మాస్ లెవెల్‌లో టైటిల్‌!

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో అనిల్ కపూర్, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతోంది.