మోహన్ లాల్ ‘దృశ్యం 3’ షురూ.. ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరిదా..?

మోహన్ లాల్ ‘దృశ్యం 3’ షురూ.. ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరిదా..?

మోహన్ లాల్  హీరోగా 2013లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం మలయాళంలో మెప్పించడమే కాదు.. ఇతర భాషల్లోనూ రీమేక్ రూపంలో సత్తా చాటింది. 2021లో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా అదే స్థాయిలో మెప్పించింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడో సినిమా వస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌కు మోహన్ లాల్‌‌ క్లాప్‌‌ కొట్టారు. ‘జార్జ్ కుట్టి కచ్చితంగా కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటాడు.. అవేమిటి అనే సస్పెన్స్‌‌, క్యూరియాసిటీనే ‘దృశ్యం 3’కి హైలైట్‌‌’ అని ఆయన చెప్పారు.

దీన్నొక థ్రిల్లర్‌‌‌‌గా కంటే ఫ్యామిలీ డ్రామాగా చూపించబోతున్నామని, గడచిన ఐదేళ్లలో జార్జ్ కుట్టి ఫ్యామిలీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు జీతూ జోసఫ్‌‌ చెప్పారు. ఆశీర్వాద్ సినిమాస్‌‌ బ్యానర్‌‌‌‌పై ఆంటోని పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నెలల్లో మలయాళ వెర్షన్‌‌ షూటింగ్‌‌ పూర్తిచేయనున్న జీతూ జోసఫ్‌‌.. వెంటనే వెంకటేష్‌‌ హీరోగా తెరకెక్కనున్న తెలుగు వెర్షన్‌‌ షూటింగ్‌‌ స్టార్ట్‌‌ చేయబోతున్నారు. ఇక జీతూ జోసఫ్‌‌ స్క్రిప్ట్‌‌తోనే అజయ్ దేవగన్‌‌ హీరోగా హిందీలోనూ ‘దృశ్యం 3’ను అనౌన్స్ చేశారు.  మలయాళ వెర్షన్ రిలీజ్‌‌ తర్వాతే హిందీ వెర్షన్‌‌ విడుదల ఉంటుందని జీతూ క్లారిటీ ఇచ్చారు.