ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ స్టార్ మూవీ

 ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ స్టార్ మూవీ

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌(Mohan Lal) కు మాలీవుడ్‌లోనే కాక సౌత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప, మనమంతా సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు చేరువైన మోహన్ లాల్ భారీ బడ్జెట్ మూవీ ‘ఒడియన్’(Odiyan). 2018 లో తెలుగు, మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్ ఈ నెల 24 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. 

మోహన్ లాల్ కెరియర్లోనే సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఒడియన్. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, మంజూ వారియర్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇందులో మోహన్ లాల్ 35 ఏళ్ల వ్యకిలా కనిపించి అలరించాడు.

అలాగే మరో 55 ఏళ్ల పాత్రలో కూడా నటించాడు. అంతేకాకుండా, ఈ సినిమాలో మోహన్ లాల్ వేసిన యోగాసనాలు, కీలకమైన యాక్షన్ సన్నివేశాలు యూత్ ను ఆకట్టుకున్నాయి.