‘ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్’ తో రక్ష‌ణాశాఖ మంత్రి దారుణ హ‌త్య

‘ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్’ తో రక్ష‌ణాశాఖ మంత్రి దారుణ హ‌త్య

ఇరాన్‌కు చెందిన ప్రముఖ అణుశాస్త్రవేత్త, ఆ దేశ రక్షణశాఖ ఉప మంత్రి డాక్టర్‌ మొహసేన్‌ ఫక్రీజాదేను శాటిలైట్, ఆర్టీఫిషియ‌ల్ ఇంటెలిజెంట్స్ ద్వారా హ‌త్య చేసిన‌ట్లు తెలుస్తోంది. గత నెల 27న ట్రెహన్‌ సరిహద్దుల్లో కారులో అమర్చిన బాంబును పేల్చడంతో పాటు కాల్పులు జరిపి ఆయ‌న‌ను హ‌త్య చేశారు. కారులో రాజధానికి తూర్పు భాగంలోని ఓ హైవేలో ప్రయాణిస్తున్న ఆయనను…ఆర్టిఫిషియల్‌ ఇంటెల్సిజెన్స్‌ సాయంతో ఎక్కడ ఉన్నారో గుర్తించి.. ఈ దాడికి పాల్పడ్డారని ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కాప్స్‌ డిప్యూటీ కమాండర్‌ అలీ ఫద్వీ తెలిపారు.

దాడిపై ఫద్వీ మాట్లాడుతూ మొహసేన్‌పై 13 రౌండ్ల కాల్పులు జరిగాయని, కేవలం ఆయనను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారని, అదే కారులో ప్రయాణిస్తున్న మొహసిన్‌ భార్య తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారని చెప్పారు. ఆ సమయంలో 11 మంది బాడీ గార్డులు కూడా వేర్వేరు కార్లలో వారిని అనుసరిస్తున్నారని అన్నారు.