
ఆసియా కప్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ డ్రామాలు ఆపడం లేదు. ఫైనల్ మ్యాచ్ లో పాక్ ను మట్టి కరిపించి ఇండియా ట్రోఫీ గెలిచింది. ఇండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. నిస్సిగ్గుగా ట్రోఫీని ఎత్తుకెళ్లింది. టెర్రిరిస్టులను పెంచి పోషిస్తున్న వారి నుంచి ట్రోఫీ తీసుకోలేం అని ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ ట్రోఫీ వదిలేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా నిస్సి్గ్గుగా ట్రోఫీని తీసుకెళ్లి వాళ్ల ఆఫీసులో పెట్టుకున్నారు.
ఆసియా కప్ ఫైనల్ (సెప్టెంబర్ 28)లో ఇండియా గెలిచిన కప్ ను బీసీసీఐ కి అప్పగించాల్సి ఉంది. లేదంటే ఐసీసీ కి అప్పగించాలి. కానీ.. ఊర్లో పుట్టిన దూడను తన కొట్టంలో కట్టేసుకున్నట్లు.. ఇండియా గెలచిన కప్ ను ఆఫీసులో పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
ట్రోఫీ విషయంలో మంగళవారం (సెప్టెంబర్ 30) జరిగిన ఏసీసీ మీటింగ్ లో ఇండియా గట్టిగా డిమాండ్ చేసింది. ట్రోఫీ ఇస్తారా ఇవ్వరా అని నిలదీసింది. ఈ విషయంలో ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు బీసీసీఐ హెచ్చరించింది. అయితే ట్రోఫీ ఇచ్చేది లేదని బీరాలకు పోయిన పాక్ మంత్రి, ఏసీసీ చీఫ్, పీసీబీ హెడ్ మొహ్సిన్ నఖ్వీ.. ఇండియా హెచ్చరికలతో మాట మార్చాడు.
ట్రోఫీ ఇచ్చేది లేదని చెప్తూనే.. ఇండియా కెప్టెన్ వచ్చి తీసుకోవాలని అన్నాడు. బీసీసీఐకి ట్రోఫీ ఇవ్వం.. ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఏసీసీ ఆఫీసులో ట్రోఫీ తీసుకోవాలని అన్నాడు. ఇండియా క్రికెట్ బోర్డుకు కప్ ఇవ్వమని.. కెప్టెన్ వ్యక్తిగతంగా వచ్చి ట్రోఫీ తీసుకోవాలని మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
ట్రోఫీ ఇవ్వాలని బీసీసీఐ వైస్ ప్రసిడెంట్ రాజీవ్ శక్లా చేసిన డిమాండ్ ను తిరస్కరించిన నఖ్వీ.. చివరికి దుబాయ్ లో ఉన్న ఏసీసీ ఆఫీసుకు వ చ్చి తీసుకోవాలని చెప్పాడు. అయితే ఈ వ్యవహారంపై బీసీసీఐ ఐసీసీకి పిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.