పాక్‌తో నో షేక్‌హ్యాండ్‌?.. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అదే రూలా!

పాక్‌తో నో షేక్‌హ్యాండ్‌?.. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అదే రూలా!

IND vs PAK No Handshake: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది. ముఖ్యంగా పురుషుల జావెలెన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్‌ల మధ్య జరిగే స్వర్ణ పతక సమరం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అంతేకాకుండా, పురుషుల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్‌కు చెందిన జాడుమణి సింగ్ మందేంగ్‌బామ్, పాకిస్థాన్‌కు చెందిన సుమామా రెహమాన్‌తో తలపడనున్నాడు.

హ్యాండ్‌షేక్ చేస్తారా? నిర్ణయం అథ్లెట్ల చేతుల్లోనే:

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక, క్రీడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీని ప్రభావంతో టీ20 ప్రపంచకప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీల సమయంలో అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం (హ్యాండ్‌షేక్) చేసేందుకు టీమిండియా క్రికెట్ జట్టు నిరాకరించింది. కానీ, క్రికెట్‌ను బీసీసీఐ నిబంధనలు నియంత్రిస్తుండగా, కామన్వెల్త్ క్రీడలలో వివిధ క్రీడలకు సంబంధించి వేర్వేరు జాతీయ క్రీడా సమాఖ్యలు ఉంటాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో పాక్ అథ్లెట్లతో కరచాలనం చేయడం లేదా పలకరించుకోవడం అనేది పూర్తిగా సదరు అథ్లెట్ల వ్యక్తిగత నిర్ణయానికే వదిలి పెట్టారు. 

బహుమతులు స్వీకరించడంపై కఠిన నిషేధం: 

* లాన్ బౌల్స్ స్పష్టత: లాన్ బౌల్స్ అధికారులు తమ జట్టుకు స్పష్టం చేస్తూ.. పాకిస్థాన్ ప్రత్యర్థులతో హ్యాండ్‌షేక్ చేయడం, హై-ఫైవ్స్ ఇచ్చుకోవడం లేదా మర్యాదపూర్వకంగా పలకరించుకోవడంలో ఎలాంటి సమస్య లేదని తెలిపారు.

* గిఫ్ట్‌లపై నిషేధం: పాకిస్థాన్ క్రీడాకారుల నుంచి ఎలాంటి కానుకలు లేదా బహుమతులు (Gifts or presents) తీసుకోవడాన్ని మాత్రం అథ్లెట్లందరికీ కఠినంగా నిరోధించారు.

* ఇతర క్రీడల్లో మరీ: క్రికెట్‌లో బీసీసీఐ హ్యాండ్‌షేక్‌ను పక్కనబెట్టినప్పటికీ, సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌లో ఇరు దేశాల జూనియర్ హాకీ జట్లు మ్యాచ్ ముగిశాక హై-ఫైవ్స్ ఇచ్చుకున్నాయి. అలాగే అంధుల మహిళల క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లో కూడా ఇరు జట్ల క్రీడాకారిణులు కరచాలనం చేసుకున్నారు.